ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి మధ్య అంతరాల కారణంగా క్యాడర్ అయోమయంలో పడిందని, ఈ విషయంలో కిరణ్ వ్యవహార శైలిపైనే అంతా గుర్రుగా ఉన్నారని వివరించినట్లు తెలిసింది. కిరణ్ శైలితో ఆయన్ను కలిసేందుకు సైతం నేతలెవరూ ఆసక్తి చూపడంలేదని చెప్పినట్లు సమాచారం. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను సమర్ధంగా అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని, పథకాల అమలులో చిత్తశుధ్ధి లోపించడం ప్రజల్లో పార్టీపై వ్యతిరేకతను పెంచేందుకు కారణమవుతోందని వివరించినట్లు సమాచారం. రాజీవ్ యువకిరణాలు పథ కం సైతం లక్ష్యాలు చేరలేకపోయిందని చెప్పినట్లు తెలిసింది. పార్టీని, ప్రభుత్వాన్ని నడపడంలో విఫలమైన కిరణ్‌ను తక్షణమే పదవి నుంచి దించేయాలని గట్టిగా కోరినట్లు తెలిసింది. అన్ని అంశాలను క్షుణ్ణంగా విన్న సోనియా, కిరణ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే తమవద్ద అన్ని నివేదికలు ఉన్నాయని, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయన్న తరహాలో మాట్లాడినట్లు సమాచారం. సోనియాతో భేటీ అనంతరం బయటకు వచ్చిన పెద్దిరెడ్డి తన వాహనాన్ని ఆపకుండా, మీడియాతో మాట్లాడకుండా వేగంగా వెళ్లిపోయారు.
Posted in: failure congress
0 comments:
Post a Comment