నూతనోత్తేజం

పల్లెల్లో ప్రతి ఒక్కర్నీ పలకరిస్తూ.. జనసమస్యలపై ఉద్యమిస్తూ.. కాంగ్రెస్, టీడీపీలకు వణుకు పుట్టిస్తూ..నాయకుడంటే ఇలా ఉండాలి అని అందరి ప్రశంసలు అందుకుంటూ మూడ్రోజులపాటు సాగిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు ఆద్యంతం అనూహ్య స్పందన లభించడంతో తీరంలో జనచైతన్యం ఉప్పొం గింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపింది.

చేగొండి హరరామజోగ య్య, అల్లు సత్యనారాయణ, తోటగోపి, కూనపరెడ్డి వీరరాఘవేంద్రరావు, పీవీఎల్ నర్సింహరాజు వంటి ఉద్ధండ నేతల చేరికతో పార్టీ జిల్లాలో ప్రబలశక్తిగా మారింది. రాష్ట్రంలో 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనున్న ఉప ఎన్నికల ప్రచారానికి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి శ్రీకారం చుట్టిన జగన్‌మోహన్‌రెడ్డికి నరసాపురం నియోజకవర్గంలో లభించిన జనాదరణ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నేతలకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఈనెల 2న జిల్లాకు వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి 4వతేదీ రాత్రి నరసాపురం బహిరంగ సభతో ప్రచారాన్ని ముగించారు. ఇటీవల టీడీపీ, కాంగ్రెస్ అధినేతల రోడ్‌షోలకు భిన్నంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సాగింది. 

ఇటీవలే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు నరసాపురం పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. వారి పర్యటన సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి జనాలను వాహనాలపై తరలించి రోడ్‌షో జరుగుతున్న ఆయా ప్రాంతాల్లోన్ని ప్రధాన కూడళ్ల వద్ద సమీకరించారు. అందుకు భిన్నంగా జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా గ్రామాల్లోకి వెళ్లి మహిళలు, వృద్ధులు, యువకులను నేరుగా కలిశారు. పలు ప్రాంతాల్లోనూ, ప్రధాన కూడళ్లలోనూ, ఇళ్ల వద్ద ఉన్న ప్రజల దగ్గరకు ఆయన నేరుగా వెళ్లి ప్రచారం నిర్వహించడం అందర్నీ ఆకట్టుకుంది. ఒకే గ్రామంలో అయిదారు ప్రాంతాల్లో జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల వద్దకు వెళ్లడంతో రోడ్‌షో ఆలస్యమైంది. పలు గ్రామాల్లో తమ ప్రాంతానికి రావాలంటూ అభిమాన జనం పట్టుపట్టడంతో ముందుగా అనుకున్న పర్యటన షెడ్యూల్ పూర్తికాలేదు. దీంతో మొగల్తూరు మండలంలోని గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించి బహిరంగ సభకు రావాల్సి వచ్చింది. మరో మారు నియోజకవర్గ పర్యటనలో మిగిలిన గ్రామాల్లో పర్యటించేలా నిర్ణయించారు. 

పర్యటిస్తూ.. పరిశ్రమిస్తూ..
నరసాపురం పర్యటనకు వచ్చిన జగన్ మోహన్‌రెడ్డి పార్టీ వాణిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పూర్తిస్థాయిలో పట్టు సాధించారు. అదే క్రమంలో ఉద్యమాలు, బహిరంగసభలో సైతం ప్రజల చెంతకు చేరేలా తనదైన శైలిలో ముందుకు సాగారు. ఎన్నికల పర్యటనకే పరిమితం కాకుండా విద్యుత్తు చార్జీల పెంపును నిరసిస్తూ మొగల్తూరు సబ్‌స్టేషన్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడంతో జిల్లా వాసులను ఎంతగానో ఆకట్టుకుంది. తమకోసం ఉద్యమించే నాయకుడు దొరికాడంటూ జిల్లా వాసులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నరసాపురం బహిరంగ సభలో తనవాణిని ప్రజలకు వినిపించగలిగారు. నరసాపురం తాజా మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజును గెలిపించాల్సిన ఆవశ్యకతను ప్రజలకు తనదైనశైలిలో చేరువచేశారు. నియోజకవర్గంలో హిందు, ముస్లిం, క్రైస్తవుల ఆశీస్సులు అందుకుంటూ.. మత్స్యకార్మికులు, గీత కార్మికుల, చేనేత బతుకుల స్థితిగతులను తెలుసుకుంటూ.. అంధులు.. వికలాంగులు, కుష్టురోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ ఆయన సాగించిన పర్యటన నాయకుడంటే ఇలా ఉండాలంటూ కొత్త నిర్వచనం పలికనట్లయ్యింది మూడ్రోజులపాటు జనప్రభంజనం లా జగన్‌మోహన్ రెడ్డి పర్యటన సాగడంతో నియోజకవర్గంలో ఫ్యాన్ గాలి మరింత ఉధృతమైంది. 

ఒక్కసారి పర్యటనతో ప్రత్యర్థులు చిత్తు
జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టిన తరుణంలోనే ప్రత్యర్థి పార్టీల్లో గుబులు రేగింది. టీడీపీ, కాంగ్రెస్‌ల్లో ఒకనాడు చక్రం తిప్పిన అత్యంత కీలకమైన నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో జిల్లా రాజకీయ ముఖచిత్రం కొత్తరూపు సంతరించుకోనుంది. 

కీలక నియోజకవర్గాల నుంచి ఉద్ధండులైన నేతలు పార్టీలోకి వచ్చారు. ఉప ఎన్నికలు జరగనున్న నరసాపురంలో అట్టడుగుస్థాయి నుంచి మండలస్థాయి నాయకుల వరకు ఇతర పార్టీల నుంచి వైఎస్సార్ పార్టీలో చేరారు. జిల్లాలోని పలు నియోజకవర్గాలకు చెందిన చేగొండి వెంకటహరరామజోగయ్య, అల్లు వెంకటసత్యనారాయణ, కూనపరెడ్డి వీరరాఘవేంద్రరావు, పీవీఎల్ నర్సింహరాజు, తోట గోపి, గొలుగూరి శ్రీరామరెడ్డి, గ్రంధి వెంకటేశ్వరరావు, గడి జయలక్ష్మి, యిళ్ల భాస్కరరావు, చేపల రాము తదితర నాయకులు జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ పార్టీలో చేరారు. పార్టీని పటిష్టం చేసుకోవడంలో జిల్లా నాయకులు కొత్త సమీకరణలకు చేసిన కృషి విశేషం. 

అడుగులో అడుగేస్తూ...
జిల్లాలోని నరసాపురంలో పర్యటించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌షో, విద్యుత్తు ధర్నా, బహిరంగ సభల్లో జిల్లాకు చెందిన పార్టీ శ్రేణులు పాల్గొని అధినేత అడుగులో అడుగేశారు. తాజా మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజును ఈ పర్యటన ప్రజలకు మరింత చేరువ చేసింది. జిల్లా పార్టీ కన్వీనర్ కొయ్యే మోషేనురాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీమంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఇందుకూరి రామకృష్ణంరాజు, మాజీ ఎమ్మెల్యేలు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పాతపాటి సర్రాజు, మోచర్ల జోహార్‌వతి, కుడిపూడి చిట్టాబ్బాయ్, పార్టీ జిల్లా పరిశీలకుడు చీర్ల జగ్గిరెడ్డి, మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు వరుపుల సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ బీఆర్‌కే రాజు, జిల్లా నాయకులు వేగిరాజు రామకృష్ణంరాజు, ఊదరగొండి చంద్రమౌళి, ఎంఎస్ రెడ్డి, కావలి నాని, వగ్వాల అచ్యుతరామారావు, అందే భుజంగరావు, బండి పట్టాభిసీతారామారావు, బెజ్జం రాజేష్‌పుత్ర, కారుమంచి రమేష్, తలారి వెంకట్రావు, వెలగల సాయిబాబారెడ్డి, పిల్లి వెంకటసత్తిరాజు, గాదిరాజు సుబ్బరాజు, నౌడు వెంకటరమన, ముదునూరి నాగరాజు, ముప్పిడి సంపత్‌కుమార్, గాదిరాజు నాగరాజు, దాట్ల అన్నపూర్ణ, దేవతి హైమావతి, కరాటం కృష్ణస్వరూప్, బీవీ రమణ, పీడీ రాజు, డీఎస్‌ఎస్ ప్రసాదరావు, పీవీ రావు, పి.అశోక్‌గౌడ్, పాలంకి ప్రసాద్, వంగలపూడి యెషయ్య, వేగేశ్న కనకరాజు సూరి, కోడే యుగంధర్ తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More