హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా నాగేశ్వరరావు

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కోఆర్డినేటర్ చిత్తరవు నాగేశ్వరరావు ఆల్‌టైం రికార్డు మెజార్టీతో గెలుపొందారు. ఇప్పటి వరకు ఎవరూ సాధించని విధంగా 962 ఓట్ల మెజార్టీ సాధించారు. సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శులు తదితర పోస్టులకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 3,562 ఓట్లు పోలయ్యాయి. మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు నాగేశ్వరరావు తన ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యత కనబరిచారు. ఉపాధ్యక్షునిగా పోలిశెట్టి రాధాకృష్ణ, కార్యదర్శులుగా ఎస్. చలపతి, డీఎల్ నాగేశ్వరరావు, సంయుక్త కార్యదర్శిగా శిరికొండ ప్రసాద్‌బాబు, కోశాధికారిగా కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి గెలుపొందారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More