ఏ
ఎండకు ఆ గొడుగు పట్టడంలో ఎంతైనా నారా బాబు తర్వాతే ఎవరైనా...!! ఆ కళపై
సర్వం సహా పేటెంటు హక్కులన్నీ ఆయనవే. బాబు వేసే ప్రతి అడుగులోనూ అది
కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూనే ఉంటుంది. గురువారం నాటి కాగ్ నివేదికను
పట్టుకుని, వైఎస్ హయాంపై ఒంటికాలిపై లేచి ఆయన వేస్తున్న అంకమ్మ శివాలు
అందుకు మరో తాజా ఉదాహరణ మాత్రమే. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో బాబు
ప్రదర్శించిన అంతులేని ఆశ్రీత పక్షపాతం, అస్మదీయులకు ఆయన చేసిన పందేరాలను ఏ
ఏటికాయేడు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఉతికి ఆరేసినా.. అడ్డంగా
తడుచుకుని పోయారాయన. పైగా అసలు కాగ్‌ను పట్టించుకోనవసరమే లేదని కూడా
తీర్మానించేశారు. ఇప్పుడేమో అదే కాగ్ నివేదికను పట్టుకుని వైఎస్ హయాంపై
ఒంటికాలిపై చెలరేగిపోతున్నారు! తనను తిట్టినప్పుడు చేదైన కాగే ఇప్పుడు బహు
తీపిగా మారిందాయనకు. నిజానికి ఏ ప్రభుత్వమైనా భూ కేటాయింపుల్లో నిర్దిష్ట
విధానాన్ని అనుసరిస్తుంది. ఓ కాలపరిమితి విధించి, ఆలోగా పరిశ్రమలను
స్థాపించాల్సిందిగా కోరుతుంది. లేదంటే కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకునే
హక్కు ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటుంది. భూమి పొందాక గడువులోగా పరిశ్రమల
స్థాపన జరిగిందా లేదా వంటి వాస్తవాలను తరచి చూడాల్సింది పోయి.. అసలు భూ
కేటాయింపులే క్షమించరాని మహాపరాధమన్నట్టుగా బాబు, ఆయన్ను నిత్యం ఆడించే
ఎల్లో మీడియా నెత్తీనోరూ బాదుకుంటున్న వైనం రోత పుట్టించక మానదు. గురివింద
బాబు హయాంలో అడ్డూ అదుపూ లేకుండా జరిగిన భూ కేటాయింపులు తదితర అవకతవకలను
ఎప్పటికప్పుడు కాగ్ కడిగి పారేసిన వైనానికి రుజువులివిగో...
పచ్చచొక్కాలకే పందేరం
‘నీరు- మీరు’ ముసుగులో బాబు నిర్వాకం
రూ. 2,533 కోట్లను పూర్తిగా తగలేశారు
చంద్రబాబు నిర్వాకంపై దుమ్మెత్తిపోసిన కాగ్
బాబు
సీఎం గిరీ వెలగబెట్టిన కాలంలో వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని టీడీపీ
కార్యకర్తలకు అక్షరాలా పంచిపెట్టారు. ఏమాత్రం ఫలితమివ్వని ‘నీరు-మీరు’
పథకానికి 2000-04 మధ్య ఏకంగా రూ.2,533 కోట్లు తగలేశారు! భూగర్భ జలాలను
పెంచుతామంటూ పైపై హడావుడి చేసి, లోలోపల ఆ ముసుగులో ఖజానాను కార్యకర్తలకు
దోచిపెట్టారు. ఇంత భారీగా నిధులు ఖర్చుచేసినా ఈ పథకం పేరిట మచ్చుకు
ఒక్కటంటే ఒక్క కట్టడం కూడా కన్పించకపోవడం దారుణమంటూ 2005 నివేదికలో కాగ్
నలుగుపెట్టింది! ‘నీరు-మీరు’ ఉద్దేశం ఏమాత్రమూ నెరవేరకపోగా పూర్తిగా
దుర్వినియోగం అయ్యాయనడానికి రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 19 జిల్లాల్లో భూగర్భ
జలాలు మరింత లోతుకు క్షీణించడమే తిరుగులేని తార్కాణం.
‘నీరు-మీరు’పై ఇంటాబయటా భారీ ప్రచారంతో ఊదరగొట్టిన బాబు, ఆ పథకంలో నిధులు పూర్తిగా పక్కదారి పట్టాయంటూ ‘కాగ్’ తలంటడాన్ని మాత్రం ‘విస్మరించారు’. ఈ కార్యక్రమానికి నిధులను ఖజానా నుంచి కేటాయించ కుండా నాబార్దు, ఎంపీ లాడ్స్, ఉపాధి హామీ (ఎంప్లాయ్‌మెంట్ అష్యూరెన్స్) పథకం, వ్యవసాయ మార్కెట్ నిధులను మళ్లించారాయన. ఇలా ఏకంగా రూ.2,533 కోట్ల నిధులను బూడిదలో పోసిన పన్నీరు చందం చేశారు. పైగా దీనివల్ల ఆయా శాఖల్లో పనులన్నీ ఆగిపోయి రెండిందాలా నష్టం జరిగింది.
కాంట్రాక్టర్లకు ఇవ్వకూడని ఈ పనులను లక్షలాది సంఖ్యలో వారితోనే చేయించడం కూడా అడ్డగోలు దోపిడీ కోసమేనన్నది సుస్పష్టం. 2000-04 మధ్య మచ్చుకు ఏడు జిల్లాల్లో తనిఖీ చేసిన కాగ్, ఖర్చయిన నిధులతో ఎలాంటి ప్రయోజనమూ చేకూరలేదని తేల్చి చెప్పింది. ఆదిలాబాద్, కడప, మహబూబ్‌నగర్, మెదక్, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో రూ.759 కోట్లు ఖర్చు పెట్టారు. వీటితో 1,32,549 పనులు చేపట్టడం లక్ష్యం కాగా, 57,933 పనులే పూర్తి చేశారు. ‘నీరు-మీరు’తో సంబంధమే లేని పనులను కూడా దాని ఖాతాలో లాగించేశారంటూ కాగ్ దుయ్యబట్టింది. చివరికి ట్యాంకర్లతో మంచినీటి సరఫరా, నర్సరీల్లో మొక్కల పెంపకాలను కూడా ‘నీరు-మీరు’గానే చూపడం బాబు సర్కారు బరితెగింపునకు పరాకాష్ట. చెరువుల పూడికతీత పనుల్లోనూ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం మేటవేశాయని కాగ్ విమర్శించింది.
పూడికతీతతో భూగర్భ జల మట్టం పెరగదని నిపుణులు చెప్పినా దానికి రూ.157 కోట్లు తగలేశారంటూ తప్పుబట్టింది. పైగా నాణ్యత నియంత్రణకు పూర్తిగా తిలోదకాలిచ్చారని దుయ్యబట్టింది. నీరు అసలు భూమిలోకే ఇంకని ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టారు. పైగా అవన్నీ చిన్నపాటి వర్షాలకే కనుమరుగయ్యాయి. ఇలాగే నీరింకని నల్లరేగడి నేలల్లో ఊట చెరువుల నిర్మాణంతో నిధులన్నీ వృథా చేశారు. ఇంతా చేసి, చివర్లో ‘నీరు-మీరు’ అమలైన జిల్లాల్లో నీటి మట్టాలు చిత్రంగా 0.13-3.04 మీటర్ల లోతుకు పడిపోయాయని కాగ్ విస్మయం వ్యక్తం చేసింది. ఈ నిధులన్నీ నేతలు, కార్యకర్తల జేబులు నింపాయని అభిప్రాయపడింది.
ఆనంద్ సినీ ‘సర్వీసెస్’
గజం ధర విలువకే ఎకరం భూమిని రాసిచ్చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. నేరుగా మంతనాలు జరిపి మరీ ఐదెకరాలను ఇలా కారుచౌకకు ధారాదత్తం చేశారంటూ 2004 కాగ్ నివేదిక బాబుపై దుమ్మెత్తిపోసింది. చిత్ర పరిశ్రమకు సంబంధించి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఆసక్తి ఉన్నవారి నుంచి స్థల కేటాయింపుల కోసం దరఖాస్తులను రాష్ట్ర చలన చిత్ర, టెలివిజన్, థియేటర్ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (కంపెనీ) 1991లో దరఖాస్తులను ఆహ్వానించింది.
అలా దరఖాస్తు చేసుకున్న 139 సంస్థల్లో ఆనంద్ సినీ సర్వీసెస్ ఒకటి. దానికి కేవలం చదరపు గజం రూ.700-800 లెక్కన స్థలం కట్టబెట్టేందుకు 1997 నవంబర్‌లో అభివృద్ధి సంస్థ ప్రతిపాదించింది. కానీ మౌలిక సదుపాయాల యూనిట్ల ఏర్పాటుకు గతంలో అంగీకరించిన ధరకే స్థలమివ్వాలని ఆనంద్ సినీ సర్వీసెస్ కోరింది. ఆనంద్ సినీ సర్వీసెస్ ఔట్‌డోర్ విభాగాన్ని నెలకొల్పేందుకు ఒక ఎకరం మించకుండా, అంటే 4,840 చదరపు గజాల కేటాయింపును 1999 జూన్‌లో కంపెనీ బోర్డు డెరైక్టర్లు ఆమోదించారు.
రెండేళ్ల తరువాత.. అంటే 2001 జూన్‌లో కంపెనీ ఎండీ నేరుగా నాటి సీఎం బాబుతో ఈ విషయమై చర్చించారు. ఫలితంగా చదరపు గజానికి రూ.700-800 వసూలు చేయాలన్న నిర్ణయం బుట్టదాఖలైంది. 1983లో పద్మాలయా, 1984లో రామానాయుడు స్టూడియోలకు కేటాయించిన నిబంధనల ప్రకారం ఎకరానికి కేవలం రూ.8,500 చొప్పున ఆనంద్ సినీ సర్వీసెస్‌కు ఐదెకరాలివ్వాలని నిర్ణయించారు. 2001 ఆగస్టులో ప్రభుత్వామోదం తర్వాత 2001 అక్టోబరు 18న కేవలం రూ.42,500కు ఐదెకరాలను కట్టబెట్టారు. కానీ ఇది సబబేనని పేర్కొనే ప్రతిపాదనలేవీ రికార్డుల్లో లభ్యం కాలేదంటూ కాగ్ ఎండగట్టింది. పైగా దీనికి బోర్డు డెరైక్టర్ల ఆమోదం కూడా లేదని పేర్కొంది.
చిల్డ్రన్ ఫిల్మ్‌సొసైటీకి మాత్రం గజానికి రూ.3 వేలు..
ఆనంద్‌కు భూ పందేరం చేయకముందే, అదే ఏడాది, అదే ప్రదేశంలో.. చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీకి ఐదెకరాలిచ్చేందుకు మాత్రం గజానికి ఏకంగా రూ.3,000 చొప్పున ధర నిర్ణయించింది బాబు సర్కారు! ఆ సమయంలో అక్కడ చదరపు గజానికి మార్కెట్ ధర రూ.3,500 అని కాగ్ తనిఖీలో తేలింది. కానీ ఆనంద్ సినీ సర్వీసెస్‌కు మాత్రం ఇటు మార్కెట్ ధరనూ, అటు చిల్డ్రన్ సొసైటీకి ఆఫర్ చేసిన ధరనూ పరిగణనలోకి తీసుకోకుండా అడ్డంగా ఐదెకరాలు కేటాయించినందుకు ఖజానాకు రూ.7.25 కోట్ల నష్టం వాటిల్లిందంటూ కాగ్ తూర్పారబట్టింది.
రహేజాకు అప్పనంగా 110 ఎకరాలు
రాష్ట్ర రాజధానిలో ఐటీ పార్కు పేరిట ముంబైకి చెందిన రహేజా కార్పొరేషన్‌ను తెరపైకి తెచ్చి అక్రమాలకు రాచబాట వేసింది చంద్రబాబే. ఆయన ఆదేశానుసారమే రహేజాతో ఐటీ పార్కు ఏర్పాటుకు ఏపీఐఐసీ లోపభూయిష్టమైన ఒప్పందం కుదుర్చుకుందంటూ 2005 కాగ్ నివేదిక ఎండగట్టింది.
మాదాపూర్‌లో ఏపీఐఐసీకి చెందిన అత్యంత విలువైన 110 ఎకరాల భూమిని జాయింట్ వెంచర్ పేరిట రహేజాకు అప్పట్లో బాబు సర్కారు అప్పనంగా అప్పగించింది. పైగా అప్పగించిన భూమికి ఆ సంస్థ నుంచి ఒక్క పైసా కూడా వసూలు చేయకపోవడాన్ని కాగ్ తీవ్రంగా తప్పుబట్టింది. జాయింట్ వెంచర్ కంపెనీ భూమి ధర చెల్లించనక్కర్లేదని, ఉద్యోగాల కల్పనకు చెల్లించే రిబేటుతో దాన్ని సర్దుబాటు చేస్తారని ఒప్పందంలో పేర్కొన్నారు. దీనివల్ల ఏపీఐఐసీ రూ.30.98 కోట్ల మేరకు నష్టపోయింది.
రూ.3 కోట్లకే నిజాం సుగర్స్ భూములు!
నిజాం సుగర్స్ లిమిటెడ్ 1998, 31 మార్చి నాటికి రూ.22.75 కోట్ల నష్టాల్లో ఉంది. లక్షలాది రైతుల దృష్ట్యా కంపెనీని పునరుద్ధరించాల్సిన ప్రభుత్వం.. నష్టాల సాకుతో కంపెనీ తాలూకు 1,042.27 ఎకరాలను కేవలం రూ.3.35 కోట్లకు రాసిచ్చేసింది. స్వయానా నాటి సీఎం చంద్రబాబు ఆదేశానుసారం జరిగిన ఈ పందేరాన్ని కాగ్ తన 2004 నివేదికలో ఎండగట్టింది. నిధుల సమీకరణలో భాగంగా కంపెనీ భూములను వదిలించుకోవాలని నిజాం సుగర్స్ ఎండీకి బాబు సూచించారు. ఎలాంటి నివేదికా అందకుండానే 1998 జూలైలో కంపెనీ ఎండీ ఓ కమిటీ వేసి, 535 ఎకరాలను అమ్మకానికి పెట్టారు.
సరైన ధర రాలేదంటూ ఆ భూముల అమ్మకాన్ని ఆ కమిటీ నిరాకరించింది. 1998 సెప్టెంబర్‌లో కమిటీని పునరుద్ధరించి, ప్రభుత్వ అనుమతే లేకుండా 632.12 ఎకరాలను అమ్మేశారు! 1998 అక్టోబర్ 5-డిసెంబర్ 9 మధ్యలో ఈ తతంగం ముగిసింది. ఇంతా చేసి ఈ అమ్మకాలతో వచ్చిన సొమ్ము.. కేవలం రూ.2.04 కోట్లు. కనీసం బోర్డు డెరైక్టర్లకు కూడా తెలియదు. తర్వాత 1999 మే 24-జూన్ 9 మధ్య మరో 410.35 ఎకరాలను రూ.1.31 కోట్లకే వదిలేశారు. ఇలా మొత్తం 1042.27 ఎకరాల వ్యవసాయ భూమిని రూ.3.35 కోట్లకు తెగనమ్మిన ఘనుడు చంద్రబాబు.
స్పెక్ట్రమ్‌కు తేరగా 22.39 కోట్లు
ప్రైవేట్ విద్యుత్ ప్రాజెక్టులంటే బాబుకు వల్లమాలిన అభిమానం! స్పెక్ట్రమ్ పవర్ జనరేషన్ కంపెనికీ అధిక స్థిర, ఇంధన చార్జీల ముసుగులో ఏకంగా రూ.22.39 కోట్లను ఆయన రాసిచ్చిన వైనం ఇందుకు చిన్న ఉదాహరణ. స్పెక్ట్రమ్ పవర్‌కు వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించే తేదీని ఆలస్యం చేయడం వల్ల అధిక చార్జీలు చెల్లించేలా బాబు సర్కారు నిర్ణయం తీసుకుంది. కంబైన్డ్ సైకిల్ కమర్షియల్ ఆపరేషన్ తేదీ జాప్యంతో 5.34 కోట్ల స్థిర చార్జీలు, రూ.17.04 కోట్ల అధిక ఇంధన చార్జీల రూపంలో సంస్థకు లబ్ధి చేకూ ర్చింది! ఈ చెల్లింపులను కాగ్ నివేదిక తప్పుపట్టింది. వాణిజ్య ఉత్పత్తికి సకాలంలో అనుమతించి ఉంటే ఈ భారమంతా తప్పేదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
బాబు భూ కేటాయింపులివీ..
రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు అవసరమున్నా, లేకున్నా అప్పనంగా భూములు కేటాయించిన ఘనుడు నారా బాబు. 1998 నుంచి మొదలుకుని పదవి నుంచి దిగిపోయేదాకా భూ పందేరాలు చేస్తూనే వచ్చారు. విపక్షాలు నెత్తీ నోరూ బాదుకుంటున్నా వినకుండా మణికొండలో గోల్ఫ్ కోర్సు, రియల్ ఎస్టేట్ కోసం 534 ఎకరాలు కేటాయించిన చరిత్ర బాబుది! ఎమ్మార్ రూపంలో బయట పడ్డ కుంభకోణానికి ఆద్యుడు ఆయనే. ఆయన హయాంలో జరిపిన విచ్చలవిడి భూ పంపిణీ వివరాలివిగో...

0 comments:
Post a Comment