తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ గురువారం సాయంత్రం కె.గంగవరం చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 12 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. పదవి పోతుందని తెలిసినా పిల్లి సుభాష్‌చంద్రబోస్ నిజాయితీగా పేదవాడి పక్షాన నిలబడ్డారని అన్నారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో ఆయనను గెలిపించాలని కోరారు. మీ అందరి దీవెనలు ఆయనకు అందించాలని విజ్ఞప్తి చేశారు
0 comments:
Post a Comment