నాడు ఏపీఐఐసీ నిర్ణయించిన ధర ఎకరాకు రూ. కోటిన్నర
‘ఐటీ పాలసీ’ పేరుతో ఆ ధరను రూ. 50 లక్షలకు తగ్గించిన బాబు
రహేజాతో ఒప్పందం తర్వాత 15 రోజుల్లోనే బాబు కొత్త పాలసీ ఎకరా రూ. 50 లక్షల చొప్పున 110 ఎకరాల అప్పగింత
ఆ సొమ్ము ముందుగా చెల్లించనవసరం లేదంటూ ఉచిత కానుక
‘రిబేటు’లో సర్దుబాటు చేసుకుంటామంటూ భూమి ధారాదత్తం
బాబు హైటెక్ నాటకంతో ఏపీఐఐసీకి రూ. 165 కోట్ల నష్టం
కాగ్ ఆ నాడే మొట్టికాయలేసినా చలించని చంద్రబాబు
ఫార్మా సెజ్‌లో ఎకరా ధర రూ. 15 లక్షల నుంచి రూ. 7 లక్షలకు తగ్గించారంటూ.. వైఎస్‌పై ఎల్లోమీడియా విషప్రచారం, సీబీఐ తప్పుడు కేసులు ‘సాక్షి’ విలువపై.. రామోజీ రాతలే చార్జ్‌షీట్‌లో నమోదు..
హైదరాబాద్, న్యూస్‌లైన్:
రూ. కోటిన్నర: 2002లో మాదాపూర్ వద్ద ఎకరా భూమికి ఏపీఐఐసీ నిర్ణయించిన ధర.
2002 జూన్ 11వ తేదీ: మాదాపూర్‌లో ఐటీ పార్కు ఏర్పాటుకు రహేజాతో నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఒప్పందం.
2002 జూన్ 27వ తేదీ: రహేజాకు ఎకరా రూ. 50 లక్షల ధరకే అప్పగించేందుకు చంద్రబాబు ఐటీ పాలసీ విడుదల.
నయా పైసా లేదు: రహేజాకు 110 ఎకరాలను ఎకరా రూ. 50 లక్షలకే ఇచ్చినా.. ఆ సొమ్ము కూడా కట్టనవసరం లేదంటూ బాబు ముందుగానే ‘రిబేటు’ ఇచ్చేసి.. అప్పనంగా రాసిచ్చేశారు.
రూ. 165 కోట్లు: నారా చంద్రబాబు నాయుడు నిర్ణయంతో ఏపీఐఐసీకి వాటిల్లిన నష్టం.
ఇది చాలు.. ఒక కంపెనీ కోసం ఏకంగా ఐటీ పాలసీ పేరుతో నాటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఆడిన హైటెక్ నాటకం గురించి చెప్పటానికి. సైబర్ టవర్స్ ప్రాంతంలో ఎకరా రూ. 65 లక్షల చొప్పున విక్రయించాలని ఫిబ్రవరి 1997లో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) నిర్ణయించింది. అదేవిధంగా ప్రతి ఏటా 18 శాతం ధరను పెంచాలనేది కూడా నిర్ణయం. ఈ లెక్కన సైబర్ టవర్స్‌కు కూతవేటు దూరంలో ఉన్న మాదాపూర్‌లో ఉన్న భూమిని 2002 నాటికి ఏపీఐఐసీ విక్రయించాల్సిన ధర ఎకరా కోటిన్నర. ఈ ధరను రూ. 50 లక్షలకే తగ్గించేందుకు వీలుగా.. ఏపీఐఐసీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని కాలదన్నుతూ రహేజాతో ఒప్పందం కుదిరిన 16 రోజులకే ఐటీ పాలసీ పేరుతో చంద్రబాబు కొత్త ‘విధానం’ కనిపెట్టారు. అయినా బాబు అక్కడితో ఆగలేదు. ఈ మొత్తాన్ని కూడా రహేజా చెల్లించాల్సిన అవసరం లేదని బంపర్ ఆఫర్ ప్రకటించారు.
మొత్తం మీద 110 ఎకరాల భూమిని ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేకుండా రహేజాకు ధారాదత్తం చేసేశారు. ఫలితంగా ఏపీఐఐసీకి రూ. 165 కోట్ల నష్టం వాటిల్లింది. జడ్చర్లలోని పోలేపల్లి సెజ్‌లో ఎకరా భూమి ధరను ఏపీఐఐసీ ధరల నిర్ణాయక కమిటీ రూ. 15 లక్షలకు నిర్ణయించిందని.. కానీ ఆ ధరను రూ. 7 లక్షలకు తగ్గించటం వల్లే అరబిందో, హెటిరో సంస్థలు ‘సాక్షి’లో పెట్టుబడులు పెట్టాయన్న సీబీఐ చార్జిషీటును ఉదహరించిన చంద్రబాబు, ఎల్లో మీడియా.. ‘రహేజాకు నజారానా’ గురించి ఏమంటారు? రహేజాకు పైసా ఖర్చు లేకుండా 110 ఎకరాల భూమిని అప్పగించటం వల్ల చంద్రబాబుకు ఎంత ముట్టింది?
రహేజా రంగప్రవేశం..
హైటెక్ సిటీ సమీపంలో భూమిని ఎకరా 65 లక్షలకు విక్రయించాలని, ప్రతి ఏటా 18 శాతం ధరను పెంచాలని 1997 ఫిబ్రవరిలో ఏపీఐఐసీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా పలు ప్రతిష్టాత్మక సంస్థలు.. టీసీఎస్‌కు 5 ఎకరాలు, సాఫ్ట్‌సోల్‌కు 2 ఎకరాలు, ఇన్ఫోటెక్ - 1, వానెన్‌బర్గ్ - 5, క్యామెక్స్, సియెర్రా ఆప్టిమా, కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్, ఎస్‌ఈఈసీ టెక్నాలజీస్, ఎస్‌క్యూఎల్ స్టార్ ఇంటర్నేషనల్ కంపెనీలకు అర ఎకరా చొప్పున, సాఫ్ట్ ప్రో - 1, జేవీపీ సాఫ్ట్‌కు ఎకరంనర చొప్పున స్థలాలను 1997 ఫిబ్రవరి 5వ తేదీన జరిగిన సమావేశంలో ఏపీఐఐసీ కేటాయించింది. అదేవిధంగా 2000 సంవత్సరంలో వానెన్‌బర్గ్ సంస్థకు ఏకంగా ఎకరా కోటి రూపాయల చొప్పున 15 ఎకరాలను ఏపీఐఐసీ కేటాయించింది. ఇక్కడే కథ మలుపు తిరిగింది. ఈ విధంగా భూమి ధర పెరుగుతూ పోతుంటే రహేజాకు ఇబ్బంది అవుతుందని గమనించిన బాబు ఐటీ పాలసీ పేరుతో హైటెక్ నాటకానికి తెరలేపారు. ఇందుకోసం ఏకంగా హడావుడిగా ఐటీ విధానం పేరుతో ఐదేళ్లకు కాకుండా కేవలం మూడేళ్ల కాలపరిమితో కూడిన పాలసీని 2002లో ప్రకటించారు. అదికూడా మరో రెండేళ్లల్లో ఎన్నికలు ఉన్నాయనగా ప్రకటించటం గమనార్హం.
కోట్లలో నష్టం...
మాదాపూర్‌లో ఐటీ, ఐటీ ఆధారిత సేవల కేంద్రాన్ని నిర్మించేందుకు 2002 జూన్ 11వ తేదీన రహేజా సంస్థతో చంద్రబాబు ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. రహేజాతో ఎంవోయూ కుదుర్చుకున్న 16 రోజుల్లోనే కొత్త ఐటీ విధానాన్ని బాబు ప్రవేశపెట్టారు. ఈ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు వీలుగా 2002 జూన్‌లోనే 27వ తేదీన ఐటీ పాలసీని బాబు విడుదల చేశారు. ఈ పాలసీ ప్రకారం ఎకరా స్థలాన్ని కేవలం రూ. 50 లక్షలకే కేటాయించాలని నిర్ణయించారు. వాస్తవానికి ఏపీఐఐసీ బోర్డు నిర్ణయం ప్రకారం 1997లో ఎకరా రూ. 65 లక్షలుగా ఉన్న ధర అక్కడి నుంచి ఏటా 18 శాతం పెరగటం వల్ల 2002 నాటికి ఎకరా ధర రూ. 1.5 కోట్లకు చేరుకుంటుంది. అంటే కోటిన్నరకు కేటాయించాల్సిన భూమిని కేవలం రూ. 50 లక్షలకే రహేజా సంస్థకు దక్కే విధంగా బాబు చక్రం తిప్పారన్నమాట. వాస్తవానికి 110 ఎకరాల విలువైన భూమికి గానూ ఏపీఐఐసీ బోర్డు తీసుకున్న ధరల నిర్ణయం మేరకు రూ. 165 కోట్లు రావాల్సి ఉంటుంది. అయితే, బాబు మార్క్ హైటెక్ తెలివితో ఏపీఐఐసీకి కేవలం ఎకరా రూ. 50 లక్షలకే బాబు ప్రభుత్వం కట్టబెట్టింది. అంటే ఎకరాకు కోటి చొప్పున మొత్తం రూ. 110 కోట్ల మేరకు ఏపీఐఐసీకి నష్టం వాటిల్లిందన్నమాట. ఈ మేరకు రహేజాకు లబ్ధి చేకూరింది. ఇలా భూమి ధరను తగ్గించ టంతో లబ్ధి పొందిన రహేజా.. బాబుకు ఎంత ముట్టచెప్పిందనే విషయం పూర్తిస్థాయిలో ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపితే తప్ప వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. ఇందుకు ప్రభుత్వం ముందుకు వస్తుందా?
ఆ సొమ్మూ వద్దన్నారు...
రహేజా సంస్థపై బాబు ప్రభుత్వం అపార ప్రేమ ఒక్కో ఎకరాకు రూ. కోటి తగ్గించటంతో ఆగిపోలేదు. కోటిన్నర విలువైన భూమిని 50 లక్షలకే అప్పగించిన చంద్రబాబు అక్కడితో ఆగలేదు. రహేజా విషయంలో మరో విచిత్రం కూడా జరిగింది. భూమి ధరను కూడా రహేజా సంస్థ ముందుగా చెల్లించాల్సిన అవసరం లేదంటూ జాక్‌పాట్ ఆఫర్‌ను బాబు ప్రకటించారు. కొత్త ఐటీ పాలసీ ప్రకారం సంస్థ కల్పించే ప్రతి ఉద్యోగానికి 20 వేలు ప్రభుత్వం ఇవ్వాల్సిన రిబేటుతో ఈ మొత్తాన్ని సర్దుబాటు చేసుకుంటామని ప్రకటించింది. రహేజా ఒక్క పైసా చెల్లించనవసరం లేకుండానే 110 ఎకరాల భూమిని ఆ సంస్థకు అప్పనంగా రాసిచ్చేశారు. మొత్తం మీద ఏపీఐఐసీకి దక్కాల్సిన రూ. 165 కోట్లలో ఒక్క రూపాయీ రాలేదు. బాబు హయాంలో భూమి ధర చెల్లించకుండానే భూమిని అప్పగించారని 2005లో తన నివేదికలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఎండగట్టింది కూడా. అరబిందో, హెటిరో సంస్థలకు ప్రైస్ కమిటీ నిర్ణయించిన ధరల కంటే తక్కువ ధరకు ఇవ్వటం వల్ల ఆ సంస్థలు ‘సాక్షి’లో పెట్టుబడులు పెట్టాయని సీబీఐ తప్పుడు చార్జిషీటును మోస్తున్న రామోజీ.. రహేజాకు భూమిని ఉచితంగా రాసిచ్చేయటం వల్ల చంద్రబాబు అండ్ కంపెనీకి ఎంత లబ్ధి జరిగిందనే విషయంపై కనీసం మాట్లాడకపోవటం ఎల్లో సిండికేట్ స్వభావాన్ని మరోసారి బయటపెడుతోంది.
ఎల్ అండ్ టీకి ఎకరా రూ. 4 వేలకే
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎల్ అండ్ టీ ఆయనకు దత్త సంస్థగా మారింది. బాబు ఏ ప్రాజెక్టు చేపట్టినా దానిని ఎల్ అండ్ టీకే ఇస్తూ వచ్చిన విషయం బహిరంగ రహస్యమే. ఈ సంస్థకు సిమెంట్ కర్మాగారం, టౌన్ షిప్ ఏర్పాటు కోసం ఏకంగా 792.86 ఎకరాల భూమిని కేవలం ఎకరా రూ. 4 వేల ధరకే కట్టబెట్టారు. అనంతపురం జిల్లాలో 519.96 ఎకరాలు, కర్నూలు జిల్లాలో 272.90 ఎకరాలు కలిపి మొత్తం 792.86 ఎకరాలను ఈ సిమెంట్ కర్మాగారం కోసం కేటాయిస్తూ 1996 ఫిబ్రవరి ఎనిమిదో తేదీన జీవో జారీ చేశారు. ఎల్ అండ్ టీకి అతి తక్కువ ధరకే భూమి కేటాయించారంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి. అయితే ఇది చంద్రబాబుకు దత్త సంస్థగా చలామణి అవుతుండటంతో కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకూ అధికారులంతా నోరు మెదపకుండా నివేదికలు పంపారు. బాబు సేవలకు ప్రతిఫలంగా హైదరాబాద్‌లోని టీడీపీ పార్టీ కార్యాలయాన్ని కూడా ఎల్ అండ్ టీ సంస్థ ఉచితంగా నిర్మించి ఇవ్వటం ‘క్విడ్ ప్రొ కో’ అంటే సీబీఐకి పట్టదెందుకో!
ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్...
వాస్తవానికి కంపెనీలకు తక్కువ ధరలకే భూములు కేటాయించటం కొత్తేమీ కాదు. ఒక కొత్త ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు తక్కువ ధరకే భూములను కేటాయించటం సాధారణం. దీనిని ‘ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్’గా వ్యవహరిస్తారు. మొదటగా వచ్చిన పరిశ్రమలకు ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ పేరుతో భూమి ధరలో 25 శాతం రిబేటు ఇచ్చే ఆనవాయితీ ఉంది. దీనినే టెలిస్కోపిక్ విధానంగా వ్యవహరిస్తారు. ఇదేమీ కేవలం ప్రభుత్వానికే పరిమితమైన విధానం కాదు. ప్రైవేటు సంస్థలు కూడా మొదటగా ప్లాటు బుక్ చేసుకున్న వారికి రాయితీ ఇస్తామంటూ ప్రతి రోజూ ఇచ్చే ప్రకటనలను మనం చూస్తుంటాం. అంతమాత్రాన దీనివల్ల సంస్థకు నష్టం వాటిల్లినట్లు కాదు. కొనే సంస్థలకు లాభం చేకూర్చినట్లు కాదు. వాస్తవానికి అరబిందో, హెటిరో.. వాటి అనుబంధ సంస్థలకు లీజుకు కేటాయించిన స్థలం మొత్తం 150 ఎకరాలు. ఈ భూమి మొత్తం కూడా ఏ మాత్రమూ అభివృద్ధి చేయని భూమిని (అన్ డెవలప్డ్ ల్యాండ్) మాత్రమే. ఈ భూమి చుట్టూ కంపౌండ్ వాల్‌ను ఆయా సంస్థలే నిర్మించుకున్నాయి. కేటాయించిన భూమిలో రోడ్ల నిర్మాణం వంటి పనులన్నీ ఈ సంస్థలే చేసుకున్నాయి. ఇందుకు ఏపీఐఐసీ నయా పైసా కూడా వెచ్చించలేదు. స్థానికులకు సహాయ, పునరావాస ప్యాకేజీని కూడా ఆ సంస్థలు అమలు చేయాల్సి వచ్చింది. భూమి కోల్పోయిన వారికి ఇళ్లు కట్టించుకునేందుకు చెరో 70 వేలతో పాటు ఉపాధి కల్పించే బాధ్యత ఈ కంపెనీలకు ఉంది. అయితే, తర్వాత మిగతా సంస్థలకు కేటాయించిన భూమి అభివృద్ధి చేసిన భూమి. అంటే రోడ్ల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలకు అయ్యే వ్యయాన్ని ఏపీఐఐసీనే భరిస్తుంది. ఈ సంస్థలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అమలు చేయాల్సిన బాధ్యత కూడా లేదు. అందుకే అరబిందో, హెటిరో సంస్థలకు కేవలం రూ. 7 లక్షలకే ఎకరా చొప్పున ఏపీఐఐసీ భూమిని కేటాయించింది. ఇది తప్పు అంటూ గొంతు చించుకుంటున్న ఎల్లో సిండికేట్.. రహేజా వ్యవహారంలో ఏ తప్పునూ చూడలేకపోవటం వారి వక్రదృష్టికి నిదర్శనం.
గురివింద బాబూ...జవాబు చెప్పవూ?
అవకాశం దొరికినా, దొరక్కపోయినా గురివింద నీతులు చెప్తున్న చంద్రబాబునాయుడు.. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు నచ్చిన సంస్థలకు కారుచౌకగా.. కట్టబెట్టారనేందుకు ఉదాహరణలు కోకొల్లలు.
ఎకరా కోటి రూపాయలు మార్కెట్ ధర ఉంటే.. ఎకరా రూ. 50 వేల ధరకే ఏకంగా 5,500 ఎకరాలు కట్టబెట్టటం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమవుతుంది. శంషాబాద్ విమానాశ్రయం విషయంలో ఇదే జరిగింది. నాడు ఏ ధరల నిర్ణాయక కమిటీ సూచనలతో కోటి రూపాయల మార్కెట్ ధరకు చంద్రబాబు 99.5 శాతం కోసేశారు?
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఎకరా భూమి మార్కెట్ ధర ఐదు కోట్లుగా ఉన్నప్పుడు.. 850 ఎకరాలను ఎకరా కేవలం రూ. 50 వేల ధరకే కట్టబెట్టాలని ఆపద్ధర్మ సీఎంగా చంద్రబాబుకు ఏ ధరల కమిటీ నిర్ణయించి చెప్పింది?
రాజధానిలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఎకరా ధర రూ. 4 కోట్లు మార్కెట్ విలువ ఉన్న 535 ఎకరాల భూమిని.. ఎకరా కేవలం రూ. 29 లక్షలకే ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు అప్పగించాలని చంద్రబాబు ఏ ధరల కమిటీ సూచనలతో నిర్ణయం తీసుకుని కట్టబెట్టారు?
ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంటుంది చంద్రబాబు భూ బాగోతం. బాబు హయాంలో చేసిన భూముల కేటాయింపులు.. వాటికి బాబు ప్రభుత్వం నిర్ణయించిన ధరలు - నాటి మార్కెట్ ధరలకు ఉన్న వ్యత్యాసం ఎంతో ఈ జాబితా చూస్తే తేటతెల్లమవుతుంది...

0 comments:
Post a Comment