విజయవాడ: ప్రజాభిమానం పుష్కలంగా ఉన్న యువనేత వైఎస్ జగన్‌పై ఆంధ్రజ్యోతి పత్రిక పిచ్చి రాతలు రాయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులను తగలబెట్టారు.జగన్‌ను ఏమిచేయలేక రాధాకృష్ణ తన రాతలు ద్వారా శాడిజం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఆంధ్రజ్యోతి ఎండీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నినాదాలు చేశారు. వన్‌టౌన్‌లో ర్యాలీ నిర్వహించి ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులను తగలబెట్టారు. రాధాకృష్ణ పిచ్చి రాతలు రాయడం మానుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర కన్వీనర్ జలీల్ ఖాన్ హితవు పలికారు.
0 comments:
Post a Comment