హైదరాబాద్: కోవూరు ఉప ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించనుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహార సమన్వయ కర్త కొణతాల రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓటు వేసి, జగన్‌ను బలపర్చాలని ప్రజలు నిశ్చయించుకున్నారన్నారు. కాంగ్రెస్-టీడీపీలు కుమ్మక్కై అధికార యంత్రాన్ని ఉపయోగించుకొని ఎన్నికుట్రలు, కుతంత్రాలు చేసినా, ఆ రెండు పార్టీలకు ప్రజలు గట్టి బుద్ది చెప్పనున్నారని తెలిపారు. వైఎస్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి రావాలంటే అధికారంలోకి వైఎస్సార్ కాంగ్రెస్ రావాలని మెజార్టీ ప్రజలు కోరుతున్నారని కొణతాల చెప్పారు.
0 comments:
Post a Comment