వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసే ఓటుతో ఢిల్లీ పెద్దల దిమ్మ తిరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు నిచ్చారు. గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న ఓదార్పుయాత్రలో భాగంగా కుర్నూతలకు చేరుకున్నారు. కుర్నూతల సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కుళ్లు రాజకీయాల మధ్య తులసి మొక్కలా ఎదగాలని వైఎస్ జగన్ అన్నారు. పేదలు, రైతుల పక్షాన నిలబడి సుచరిత పదవీత్యాగం చేశారని జగన్ తెలిపారు. ఉపఎన్నికల్లో సుచరితను భారీ మెజార్టీతో గెలిపించాల వైఎస్ జగన్ ప్రజలను కోరారు.





0 comments:
Post a Comment