వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ పాల్గొన్న బహిరంగ సభకు హాజరైన అశేష జనసందోహంతో గుంటూరులోని స్తంభాలగరువు సెంటర్ పోటెత్తింది. యువనేతను చూసేందుకు వచ్చిన జనంతోవీధులన్నీ కిక్కరిసాయి. ఎటు చూసినా జనమే కనిపించారు. ఇసుక వేసినా రాలదేమో అన్నంతగా జనం కనిపించారు. తనపై అభిమానంతో తరలివచ్చిన కార్యకర్తలకు, అభిమానులకు జగన్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.





0 comments:
Post a Comment