వైఎస్సార్ కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక వేదికైన కేంద్ర కార్యనిర్వాహక మండలి (సీఈసీ)లోకి పువ్వాడ అజయ్ కుమార్ (ఖమ్మం)కు చోటు లభించింది. ఈయన సీపీఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడు. అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అజయ్‌ను సీఈసీలోకి తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయ సమన్వయకర్త పి.ఎన్.వి.ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదే విధంగా ఖమ్మం జిల్లా యువజన విభాగ కన్వీనర్‌గా రామసహాయం నరేష్‌రెడ్డిని నియమించినట్లు తెలిపారు.
0 comments:
Post a Comment