జగన్ ప్రభంజనం తథ్యం: జోగయ్య

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2014 ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి ముఖ్యమంత్రి కావడం తథ్యమని మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య అన్నారు. గురువారం ఏలూరు లో విలేకరులతో మాట్లాడారు. తాను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని, వచ్చే నెల 2న జగన్‌మోహన్‌రెడ్డి నర్సాపురం వచ్చినప్పుడు ఆయన సమక్షంలో తన అనుచరులతో కలిసి పార్టీలో చేరతానని స్పష్టం చేశారు. జగన్‌ను అవినీతిపరుడిగా చిత్రీకరించే ప్రయత్నాలను ప్రజలు నమ్మడంలేదని ఈ విషయం కడప, కోవూరు ఉప ఎన్నికల్లో నిరూపితమైందన్నారు. 

బడుగు, బలహీన వర్గాలు, దళితులు, శ్రామిక వర్గాల సమస్యలను పరిష్కరించే సత్తా ఉన్న ఏకైక నేతగా జనం జగన్‌ను నమ్ముతున్నారని తెలిపారు. మహానేత వైఎస్‌ఆర్ చేపట్టిన ఆచరణ బద్ధమైన కార్యక్రమాల వల్లే 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని మరువకూడదని తెలిపారు. త్వరలో జరిగే ఉప ఎన్నికల్లోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయమని జోస్యం చెప్పారు. చిరంజీవి రాజీనామా చేసిన తిరుపతిలోనూ ఆ పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమన్నారు. 2009 ఎన్నికల్లో చిరంజీవి సత్తా తేలిపోయిందని చెప్పారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More