దళితుల్లో చిచ్చు రేపింది చంద్రబాబునాయుడేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేతలు నల్లా సూర్యప్రకాష్, కొల్లి నిర్మలా కుమారి అన్నారు. చంద్రబాబు దళితుల కోసం చేసింది శూన్యమన్నారు. దళితుల కోసం నిజమైన కృషి చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమేనని వారు పేర్కొన్నారు. బాబు హయాంలో దళితుల నిధులు దారిమళ్లాయని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు పొడిగించి అయినా దళితుల నిధులపై చర్చ జరపాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టే రోజు అతి త్వరలో వస్తుందన్నారు.
0 comments:
Post a Comment