* బోజ్యా, రాజమౌళిల మృతి పట్ల తీవ్ర సంతాపం* వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి* అన్నివిధాలా అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపు
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆకాంక్షిస్తూ బోజ్యానాయక్, రాజమౌళి ఆత్మహత్య చేసుకోవడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. బలిదానాలు వద్దని తెలంగాణ విద్యార్థులకు, యువకులకు సోమవారం ఆయన విజ్ఞప్తి చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కుటుంబాలకు అన్నివిధాలా బాసటగా నిలవాల్సిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
0 comments:
Post a Comment