వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు శాసనసభ ఆవరణలో ప్రత్యేకంగా చాంబర్‌ను కేటాయించాలని ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి మరోసారి స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆమె మంగళవారం స్పీకర్‌ను ఆయన చాంబర్‌లో కలిశారు. కొద్ది రోజులక్రితం చాంబర్ కావాలంటూ విజయమ్మ లేఖ రాసిన విషయాన్ని శోభానాగిరెడ్డి ఆయనకు గుర్తు చేశారు. అసెంబ్లీ వాయిదా పడినపుడు విరామంలో విజయమ్మ కూర్చోవడానికి అనువుగా చాంబర్ అవసరమని వివరించారు. బడ్జెట్‌పై ప్రసంగించడానికి విజయమ్మకు సభలో అవకాశమివ్వాలని కూడా ఆమె ఈ సందర్భంగా స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.
0 comments:
Post a Comment