* ఎన్నికల్లో ఆ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందాలు: భూమా
* రెండు పార్టీలూ కలిసి పోటీచేసినా జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేరు
ఆళ్లగడ్డ (కర్నూలు), న్యూస్‌లైన్: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ టార్గెట్.. కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి పేర్కొన్నారు. ఆయన శనివారం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్, టీడీపీలు కలిసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించటమే ధ్యేయంగా పని చేస్తున్నాయన్నారు. నెల్లూరు జిల్లా కోవూరులోనూ వైఎస్సార్ సీపీ మెజారిటీని తగ్గించేందుకు రెండు పార్టీల నాయకులూ శాయశక్తులా ప్రయత్నించి విఫలమయ్యారని ఎద్దేవా చేశారు.
త్వరలో జరిగే 18 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల్లోనూ అధికార, ప్రతిపక్ష పార్టీలు లోపాయికారీ ఒప్పందంతోనే ఎన్నికల బరిలోకి దిగే కుయుక్తులు పన్నుతున్నాయని విమర్శించారు. రెండు పార్టీలూ కలిసి పోటీ చేసినా జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేరని భూమా ఉద్ఘాటించారు. అన్నిచోట్లా కాంగ్రెస్, టీడీపీలు రెండు, మూడు స్థానాల కోసం పోటీ పడాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు నల్లేరు మీద నడకేనని.. తవు ప్రయత్నమంతా మెజారిటీ పెంచుకోవటంపైనే ఉంటుందని తెలిపారు.
* రెండు పార్టీలూ కలిసి పోటీచేసినా జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేరు
త్వరలో జరిగే 18 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల్లోనూ అధికార, ప్రతిపక్ష పార్టీలు లోపాయికారీ ఒప్పందంతోనే ఎన్నికల బరిలోకి దిగే కుయుక్తులు పన్నుతున్నాయని విమర్శించారు. రెండు పార్టీలూ కలిసి పోటీ చేసినా జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేరని భూమా ఉద్ఘాటించారు. అన్నిచోట్లా కాంగ్రెస్, టీడీపీలు రెండు, మూడు స్థానాల కోసం పోటీ పడాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు నల్లేరు మీద నడకేనని.. తవు ప్రయత్నమంతా మెజారిటీ పెంచుకోవటంపైనే ఉంటుందని తెలిపారు.
0 comments:
Post a Comment