హైదరాబాద్, న్యూస్‌లైన్: టీడీపీ అధినేత చంద్రబాబుకు విధానాల కంటే ఓట్లే ముఖ్యమని ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ఆంధ్రా, తెలంగాణ తనకు రెండు కళ్లు అన్న చంద్రబాబుకు ఉప ఎన్నికల ఫలితాలతో కోవూరులో ఒక కన్ను పోయిందని, తెలంగాణలో రెండో కన్ను కూడా పోయిందని అన్నారు. హిమాయత్‌నగర్ మండల కార్యాలయం వద్ద ఎంఆర్‌పీఎస్ చేపట్టిన నిరాహార దీక్షలు గురువారం 27వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ.. వర్గీకరణపై మాట్లాడకపోతే ఒక్క ఓటు కూడా పడదనే భావన అన్ని పార్టీల్లో కలిగించాలని సూచించారు.






0 comments:
Post a Comment