గుంటూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లాలో నిర్వహిస్తున్న ఓదార్పుయాత్ర గురువారంతో ముగిసింది. పది రోజుల విరామం అనంతరం మళ్లీ జిల్లాలో ప్రారంభమవుతుందని పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. గుంటూరు జిల్లాలో 62 రోజుల పాటు నాలుగు విడతలుగా ఓదార్పుయాత్ర కొనసాగిందని చెప్పారు.
ప్రతి చోట, ప్రతి గ్రామాన ప్రజలు బ్రహ్మరథం పడుతుండడంతో నిర్ణీత షెడ్యూల్ కన్నా యాత్ర ఆలస్యంగా సాగుతోందని వివరించారు. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాల్లో యాత్ర జరిగిందని, పది రోజుల విరామం అనంతరం మళ్లీ జిల్లాలో పునఃప్రారంభమవుతుందన్నారు. హైదరాబాదులో పార్టీ కార్యక్రమాలు, సమావేశాలు, అనంతపురం జిల్లా ధర్మవరంలో చేనేత సమస్యల పరిష్కారం కోసం 48 గంటల దీక్ష తదితర కార్యక్రమాలు ఉండడంతో విరామం ప్రకటించినట్లు వివరించారు.

0 comments:
Post a Comment