రాష్ట్రంలో పేద వర్గాల సంక్షేమం కోసం మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టి న పథకాల అమలు ధ్యేయంగానే వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి పార్టీని స్థాపించారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎఎస్. మనోహర్ తెలి పారు. సోమవారం మండలంలోని డీబీ పల్లి మిట్టయిండ్లు,శాంతినగర్ గ్రామాల్లో జరిగిన పార్టీ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వైఎస్‌ఆర్ పథకాలు అమలు కావాలంటే జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని పట్టించుకోకుండా నిరసనలకు వెళ్ళిన దళితనాయకులపై పోలీసు జులుం చూపడం ఎంతవరకు సమంజసం అన్నారు.రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబు తమ పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్‌ఆర్ విగ్రహాలను కూల్చేస్తామనడం గర్హనీయమని తెలిపారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరిక:
డీబీపల్లె మిట్టయిండ్లు, శాంతినగర్ గ్రామాల్లో పలువురు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో ఓబుల్‌రెడ్డి,బాబు,కృష్ణమూర్తి,బాబు,బెన్ని,ఆనంద్,గుండురావు,మోహన్‌రావు,విద్యాధర సుబ్బన్న,బాలకృష్ణయ్యలతో పాటు పలువురు మహిళలు ఉన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా మాలమహానాడు కార్యదర్శి రవి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు సయ్యద్, అమర్, ప్రసాద్‌కుమార్, మురుగేష్ తదితరులు పాల్గొన్నారు.

0 comments:
Post a Comment