న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో రామోజీరావుకు చుక్కెదురైంది. విశాఖపట్నం సీతమ్మధారలోని ఈనాడు కార్యాలయం స్థలం విషయంలో రామోజీరావు దాఖలు చేసిన సవరణ పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. తప్పుడు వివరాలతో దావా వేశారంటూ అత్యున్నత న్యాయస్థానం రామోజీపై మండిపడింది. దీనికి తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కోర్టు గట్టిగా సమర్ధించింది.
సీతమ్మధారలో ఈనాడుకు 9 వేల 200 గజాల స్థలమే ఉందని రామోజీరావు గతంలో దావా వేశారు. అయితే దీనిపై స్థల యజమాని వర్మ పోలీసు కేసు పెట్టారు. పిటిషన్ పరిశీలించిన హైకోర్టు రామోజీ తప్పుడు వివరాలతో దావా వేశారని నిర్ధారించింది. తప్పుడు వివరాలను సవరించుకుంటానని రామోజీరావు సుప్రీంకోర్టులో సవరణ పిటిషన్ దాఖలు చేశారు. 11 వేల 200 చదరపు గజాలు ఉన్నట్లుగా తనకు ఇప్పుడే తెలిసిందని ఆయన కోర్టుకు వివరించారు. అయితే రామోజీ వివరణపై కోర్టు మండిపడింది. గతంలోనే మీకు ఈ విషయం తెలుసని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది.

0 comments:
Post a Comment