దొడ్లేరు: రైతుల కోసం అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలిచిన 17 మంది ఎమ్మెల్యేలకు సెల్యూట్ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లాఓదార్పుయాత్రలో భాగంగా జగన్ దొడ్లేరు గ్రామానికి చేరుకున్నారు.
దోడ్లేరులో ఏర్పాటు చేసిన సభలో జగన్ మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని అప్రతిష్టపాలు చేయడానికి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నాయన్నారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ చెడిపోయిందని.. దాని బాగు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మహానేత రెక్కల కష్టంతోనే కేంద్రంలోనూ, రాష్ర్టంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి తగినంత బలం లేనప్పుడు అవిశ్వాస తీర్మానం చంద్రబాబు పెట్టలేదని...ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లోవిలీనం చేశాక చంద్రబాబుకు ధైర్యం వచ్చిందని.. ఆతర్వాతనే కాంగ్రెస్ పెద్దలకు సైగ చేసి... ఆయన అవిశ్వాస తీర్మానం పెట్టారని ఆయన విమర్శించారు. |
0 comments:
Post a Comment