కరెంట్ చార్జీల పెంపునకు నిరసనగా ఏప్రిల్ 3న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోని విద్యుత్ సబ్‌స్టేషన్ల ఎదుట ధర్నాలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ ధర్నా ద్వారా పాలకుల కళ్లు తెరిపించాలని ఆయన సూచించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఐదేళ్ల పాటు కరెంట్ చార్జీలు ఎట్టి పరిస్థితిలో పెంచబోమని దివంగత వైఎస్ ఇచ్చిన హామీకి ఆయన రెక్కల కష్టంమీద ఏర్పడిన ప్రస్తుత ప్రభుత్వం తిలోదకాలిస్తోందని జగన్ మండిపడ్డారు.





0 comments:
Post a Comment