బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావులు బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. జగ్జీవన్ రామ్ స్పూర్తితో దళిత, బడుగు బలహీన వర్గాలు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకొవాలని వారు కోరారు. ఆయన జీవితం అందరికి ఆదర్శవంతమని సూర్యప్రకాష్ , జూపూడి అన్నారు.





0 comments:
Post a Comment