చంద్రగిరిలో గ్రామ పంచాయతీకి ఎలాంటి సుంకం చెల్లించకుండా రైతులు తమ పంటను అమ్ముకునే వెసులుబాటును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కల్పించారు. రైతులు తమ పంటలను దినసరి మార్కెట్‌లో పట్టణంలో ఎక్కడ అమ్మాలన్నా పంచాయతీ నుంచి టెండరు పొందిన వారికి సుంకం చెల్లించాలి. వైఎస్‌ఆర్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పంచాయతీ నుంచి టెండరు పొందారు. ఏడాది పాటు రైతులు ఎవరికీ సుంకం చెల్లించుకుండా ఉచితంగా అమ్ముకునేందుకు అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యులు భూమన కరుణాకర్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సదుపాయం కల్పించడం తమకు ఎంతో ఊరటనిస్తుందని రైతులు పేర్కొన్నారు.
0 comments:
Post a Comment