ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారానికి.. కువైట్‌లో వైఎస్సార్ సీపీ భేటీ

టీడీపీ, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్‌పై ప్రవాసాంధ్రుల ఆగ్రహం

హైదరాబాద్, న్యూస్‌లైన్: గల్ఫ్‌లో ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్‌లో రెండ్రోజులపాటు సమావేశాన్ని నిర్వహించింది. ఈ నెల 23, 24 తేదీల్లో జరిగిన ఈ భేటీకి రాష్ట్రం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఎ.అమరనాథరెడ్డి, కె.శ్రీనివాసులు, జి.శ్రీకాంత్‌రెడ్డి, ఎన్.రఘురామిరెడ్డి, అబ్దుల్ రెహ్మాన్, అంబటి రాంబాబు, కె.సురేష్‌బాబు, రాజ్ ఠాకూర్, పోల శ్రీనివాసులు, వి.రాంమోహన్‌లు హాజరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నారై విభాగ కన్వీనర్ మేడపాటి వెంకట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు స్థానిక తెలుగు ప్రజలు 8,500 మంది పైగా హాజరయ్యారు. ఈ భేటీలో తెలుగు ప్రజలు గల్ఫ్‌లో ఎదుర్కొంటున్న సమస్యలను చర్చిం చారు. 

దీంతో పాటు తెలుగునాట జరుగుతున్న రాజకీయాల పట్ల సభ కోర్డినేటర్ బి.హెచ్.ఇలియాస్, స్థానిక నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో కాంగ్రెస్ సర్కారు కుమ్మక్కై.. జగన్‌మోహన్‌రెడ్డిని అప్రతిష్టపాలు చేస్తున్న తీరును ముక్తకంఠంతో ఖండించారు. ఆ రెండు పార్టీలకు గుణపాఠం వచ్చేలా వచ్చే ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఓటు ఆయుధంతో తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. విలువలు, విశ్వసనీయతకు కట్టుబడి పదవులను వదులుకున్న వైఎస్‌ఆర్ అభిమాన ఎమ్మెల్యేలను తిరిగి అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి రాష్ట్రంలోని తమ కుటుంబ సభ్యుల ద్వారా కృషి చేస్తామన్నారు. అవసరమైతే ఎన్నికల ప్రచారానికి వస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు సావనీర్‌ను ఆవిష్కరించారు. ఈ సభను దిగ్విజయం చేయడానికి బాల్‌రెడ్డి, కె.సురేంద్రరెడ్డి, నాగరాజు, చింతల చంద్రశేఖర్‌రెడ్డి, ఎం.వి.నర్సారెడ్డి, రాక్కాశి సీను, ఆకుల ప్రభాకర్, ఎన్.మహేష్‌రెడ్డి, తెట్టు రఫి, టి.జి.భాస్కర్‌రెడ్డి, లాజారస్, దుర్గారెడ్డి, ఇనాయత్, ఆర్.నారాయణరెడ్డి, మన్నూరు చంద్రశేఖర్, బాబు రాయుడు, అన్సార్, లలిత్‌రాజ్, రవి నాయుడు, రమణయ్య యాదవ్, ఎక్బాల్, రావూరి రమణ, సత్తార్ ఖాన్, ఎం.శీను, కల్లూరి వాసు, కె.మనోహర్, పి.సుబ్బరామిరెడ్డి, వై.వి.భాస్కర్‌రెడ్డిలు కృషి చేశారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More