హైదరాబాద్ బల్కంపేటలోని వైఎస్ఆర్ సేవాదళ్ ఆధ్వర్యంలో మంగళవారం పేదలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్యులు పేదలకు పరీక్షలు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజ్ ఠాకూర్, వెల్లల రామ్‌మోహన్ పాల్గొన్నారు. పేదలను ఆదుకోవడం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిందని రాజ్ ఠాకూర్ చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని వెల్లల రాంమోహన్ తెలిపారు.
0 comments:
Post a Comment