ఎర్ర చందనం అక్రమ రవాణాపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) హైకోర్టులో మాజీ మంత్రి శంకర్రావు దాఖలు చేశారు. సుమారు 500 కోట్ల రూపాయల ఎర్ర చందనం అక్రమ రవాణా జరిగిందని పిల్‌లో తెలిపారు. ఎర్ర చందనం అక్రమ రవాణాలో ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి పాత్రపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోర్టును కోరారు. ఈ కేసులో అటవీ మంత్రిత్వశాఖను కూడా చేర్చారు. ఎర్రచందనం ఎగుమతిపై కేంద్రం విధించిన నిషేధానికి వ్యతిరేకంగా ఎగుమతులు జరిగాయన్నారు.  





0 comments:
Post a Comment