బాబును జనం నమ్మరు: లక్ష్మీపార్వతి

రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మాటల్ని ఇకపై విశ్వసించబోరని ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి విమర్శించారు. బాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీని పతనావస్థకు చేర్చారని దుయ్యబట్టారు. గుంటూరులో గురువారం లక్ష్మీపార్వతి విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీకి పోలైన ఓట్లు...తగ్గిన ప్రజాదరణను స్పష్టం చేస్తున్నాయన్నారు. రాజ్యసభ సీట్లను వం దల కోట్లకు అమ్ముకోవడం బాబుకే చెల్లిందని, డబ్బు రాజకీయాలు ఆయనతోనే మొదలయ్యాయని ఆరోపించారు. 

జగన్ వేగుచుక్కలా వస్తున్నారు.. 
ప్రస్తుత తరుణంలో వేగుచుక్కలా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వె.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల ముందుకు రావ డం సంతోషకరమని లక్ష్మీపార్వతి అన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో 18 అసెం బ్లీ స్థానాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ విజయబావుటా ఎగుర వేయడం ఖాయమన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌లు తెరమరుగు కానున్నాయన్నారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More