రాబోయే ఉప ఎన్నికలు.. రాజకీయాల్లో విలువలను వెనక్కి తెచ్చే గొప్ప యజ్ఞం

ప్రజలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు
రాబోయే ఉప ఎన్నికలు.. రాజకీయాల్లో విలువలను వెనక్కి తెచ్చే గొప్ప యజ్ఞం
ఆ ఎన్నికల్లో ప్రజల్ని కొనడానికి మంత్రులు డబ్బు మూటలతో వస్తారు
ప్రజల ఆత్మీయతను, అనురాగాన్ని వేలంలో కొనడానికి యత్నిస్తారు
మీరు డబ్బులు తీసుకోండి.. కానీ మనస్సాక్షికే ఓటేయండి
పేదవాడికి అండగా నిలబడిన సుచరితమ్మను చూసి నేను గర్వపడుతున్నా


ఓదార్పుయాత్ర నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కలసికట్టుగా ఒక్కటైన దిగజారుడు రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ చెడిపోయిన రాజకీయాలను బాగుచేయడం కోసం రైతులు, రైతు కూలీలు, పేదలు అందరం ఒక్కటవుదాం.. పేదలకు అండగా నిలబడే నాయకత్వం తెచ్చుకుందాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. డబ్బుతో, సారా ప్యాకెట్లతో, మద్యం సీసాలతో ఆత్మగౌరవాన్ని కొనలేమని, మనం ఇచ్చే తీర్పుతో వాళ్లకు తెలిసిరావాలని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా ఓదార్పుయాత్ర 77వ రోజు సోమవారం ఆయన ప్రత్తిపాడు నియోజకవర్గంలోని రూరల్ గ్రామాల్లో పర్యటించారు. ప్రత్తిపాడు నియోజకవర్గ కేం ద్రంలో నూర్‌బాషా జహనబీ కుటుంబాన్ని ఓదార్చారు. మొత్తం ఎనిమిది వైఎస్సార్ విగ్రహాలను, రెండు అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. పలు గ్రామాల్లో ప్రసంగించారు.

ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

సుచరితమ్మను చూసి గర్వపడుతున్నా: పదవి పోతుందని తెలిసినప్పుడు ఒక్క విలువలు ఉన్న ఎమ్మెల్యేలు తప్ప మిగతా ఎమ్మెల్యేలు పేదవాడి పక్కన నిలబడడానికి భయపడతారు. రైతులకు తోడుగా నిలబడడానికి నాలుగుసార్లు ఆలోచన చేస్తారు. ఇక్కడ మాత్రం తమ పదవులు పోతాయనే సంగతి తెలిసి కూడా, నిజంగా ప్రతి పేదవాని పక్షాన నిలబడటానికి, ప్రతి రైతన్నకు అండగా నిలబడడానికి, చెడిపోయి ఉన్న ఈ రాజకీయ వ్యవస్థలో విలువలు తిరిగి వెనక్కి తీసుకురావడానికి, విశ్వసనీయత అనే పదానికి మళ్లీ అర్థం తీసుకొని రావడానికి.. అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన నా చెల్లి, మీ ఎమ్మెల్యే సుచరితమ్మను చూసి నేను గర్వపడుతున్నాను. పెద్దపెద్ద మగవాళ్లు చేయలేని ఆ గొప్ప పనిని ఒక ఆడపడుచుగా.. అందులోనూ దళితబిడ్డగా సుచరితమ్మ చేసింది అని చెప్పటానికి నేను గర్వపడుతున్నా.. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి కార్యకర్తా కూడా ఫలాన వ్యక్తి మా నాయకుడు అని సగర్వంగా తలెత్తుకొని చెప్పాలి. కాలర్ ఎగరేసి ఫలాన పార్టీ మాదీ అని చెప్పుకునేటట్లు ఉండాలి.

పరివర్తనతో కూడిన రాజకీయం రావాలని చెప్పా..

నాకు ఆ వేళ బాగా గుర్తుంది. ఆవేళ సుచరితమ్మకు నేను ఒకే ఒక మాట చెప్పా. అమ్మా! మనం ఇవాళ అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపితే రైతన్నకు తోడుగా నిలబడతాం, పేదవానికి అండగా నిలబడతాం.. అలా నిలబడినందుకు డిస్‌క్వాలిఫై అవుతాం.. మన పదవులు పోతాయి.. మన పదవులు పోయినందు వలన ఉప ఎన్నికలు వస్తాయి.. అయినా ఫర్వాలేదు. ఇవాళ ఈ రాజకీయ రంగం పూర్తిగా కల్మషమైపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రాజకీయ వ్యవస్థలో పరివర్తన రావాలి. గ్రామాల్లో రైతన్నలు కష్టాల్లో ఉన్నారు.. రైతు కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో వాళ్లకు తోడుగా నిలబడాల్సిన మనిషి కావాలి. మన పదవులు పోయినా ఫర్వాలేదు తల్లీ.. రైతుకూ.. రైతు కూలీకీ అండగా నిలబడుదాం తల్లీ అని చెప్పా.. నా మాటను గౌరవించి నా చెల్లి రైతన్నకు అండగా నిలబడింది.

మనస్సాక్షి చెప్పినట్లు ఓటెయ్యండి: ఇక్కడ త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయి. ఇక్కడ జరుగబోయేవి ఎన్నికలు కానేకావు. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను బాగుచేసి, విలువలను, విశ్వసనీయతను తిరిగి రప్పించే గొప్ప యజ్ఞం. ఉప ఎన్నికలంటే కష్టమనే సంగతి నాకు తెలుసు. పోలీసులంతా అధికార పార్టీ చెప్పు చేతల్లోనే ఉంటారు. ఉప ఎన్నికలంటే మంత్రులు మూటలకు మూటలు డబ్బు సంచులు తీసుకొని వస్తారని నాకు తెలుసు. ఆప్యాయతలను.. అనుగారాలను వేలం వేసి కోనడానికి ప్రయత్నం చేస్తారని కూడా తెలుసు. నేను ఒక్క మాట చెప్తున్నా.. వాళ్ల దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి. వాళ్లు డబ్బులు ఇస్తామని వచ్చినప్పుడు ఏ ఒక్కరు కూడా వద్దనకండి.. డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకోండి. తరువాత మాత్రం మీ మనస్సాక్షి చెప్పినట్టు ఓటు వేయండి.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More