తెలంగాణలో టీడీపీకి మరోసారి చావుదెబ్బ తగిలింది. తెలంగాణ వేగంతో దూసుకొచ్చిన కారు దెబ్బకు సైకిల్ పచ్చడిపచ్చడైంది. తెలంగాణలో టీడీపీ పునాదులను కకావికలు చేసింది. చంద్రబాబు మాటలు నమ్మని జనం.. టీడీపీని ఏ ఒక్క స్థానంలోనూ గెలిపించలేదు సరికదా.. దారుణంగా ఓడగొట్టారు. వంద అడుగుల లోతున పాతిపెట్టారు. టీడీపీ రెండు కళ్లనూ తూట్లు పొడిచారు. రైతు పోరుబాట పేరుతో దండయావూతలు చేసినా ఫలితం లేకపోయింది. తెలంగాణలోని ఆరు స్థానాలతో పాటు.. సీమాంవూధలో ఉప ఎన్నిక జరిగిన ఒక స్థానంలోనూ టీడీపీకి పరాభవాన్నే మిగిల్చారు. ‘‘నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు’’ అని చంద్రబాబు గొంతు చించుకున్నా.. జనం వినిపించుకోలేదు.





0 comments:
Post a Comment