హైదరాబాద్ : పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డితో పాటు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా సభ్యత్వ నమోదు, గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజా సమస్యలపై మరింతగా పోరాటాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.
0 comments:
Post a Comment