వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఈరోజు జరిగిన యూరేనియం కార్పోరేషన్ ఆఫ్ ఇండియా గ్రీవెన్స్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే విజయమ్మ పాల్గొన్నారు. ఈ కార్పోరేషన్ వల్ల పులివెందులలో రైతులు 600 ఎకరాల భూమిని కోల్పోయారని స్థానికులు చెప్పారు. 178 కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలిచ్చారు. మరో 134 మందికి సంబందించిన ఉద్యోగాలు ఇంకా పెండింగ్‌లో పెట్టారని వారు తెలిపారు. ఈ ఆంశానికి సంబంధించి కార్పోరేషన్ అధికారులతో విజయమ్మ మాట్లాడారు. బాధిత కుటుంబాలకు వెంటనే ఉద్యోగాలివ్వాలని సూచించారు.
అనంతరం వేముల మండలంలోని నల్లచెరువుపల్లె వద్ద ఉన్న రాజశేఖర చెరువు కింద భూములు కోల్పోయిన 38 మంది రైతులకు విజయమ్మ చెక్కులు అందజేశారు. 80 లక్షల 85 వేల 500 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం వేముల మండలంలోని నల్లచెరువుపల్లె వద్ద ఉన్న రాజశేఖర చెరువు కింద భూములు కోల్పోయిన 38 మంది రైతులకు విజయమ్మ చెక్కులు అందజేశారు. 80 లక్షల 85 వేల 500 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.