వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని ఎదుర్కోవడం కష్టమని, అందుకే ఆయనపై కాంగ్రెస్, టిడిపి, ఎల్లోమీడియా, సిబిఐ కలసి కుట్రలు పన్నుతున్నాయని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి ఆరోపించారు. ఈరోజు ఆమె ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈనాడులో వచ్చిన కథనాలను ఖండించారు. జగన్ ని అరెస్ట్ చేస్తారంటూ ఈనాడు తప్పుడు కథనాలు రాస్తోందన్నారు. తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువాలు వేసుకొని శాసనసభకు వెళ్లామని అంతకంటే తమ మధ్య ఇంకేమి యూనిటీ కావాలని ఆమె ప్రశ్నించారు.
ఏడుగురు మాత్రమే హాజరవడంతో టిడిఎల్ పి భేటీని రద్దు చేశారని, అది రామోజీ రావుకు కనిపించదా? అని ఆమె ప్రశ్నించారు.
ఆనాడు తనని గద్దె దించడానికి చంద్రబాబు నాయుడు, రామోజీ రావులు కలిసి పన్నిన కుట్రని ఎన్టీఆర్ ఇక్కడ ఉన్నప్పుడే తెలుసుకున్నారని చెప్పారు. హైదరాబాద్ వెళ్లిన తరువాత రామోజీరావు సంగతి తేలుస్తానని ఎన్టీఆర్ ఇదే కర్నూలులో అన్నారని గుర్తు చేసుకున్నారు.
గజదొంగ కేసు నుంచి తప్పించుకున్న ఆనందం టిడిపిది అని ఆమె అన్నారు. ప్రతి రోజు ఏదోఒక ప్రజాసమస్యపై జగన్మోహన రెడ్డి ఆందోళన చేస్తూనే ఉన్నారన్నారు. ప్రతిపక్షం చేయని పనులను జగన్మోహన రెడ్డి చేస్తున్నారని చెప్పారు. జగన్ చేపడుతున్న కార్యక్రమాల వల్ల టిడిపికి నిద్రపట్టడంలేదన్నారు. అందుకే కుట్ర పన్నుతోందన్నారు.
సిబిఐ లీకులపై కోర్టుకు వెళతామని చెప్పారు. సిబిఐ లీకుల వెనుక ఎవరున్నారో చెప్పాలన్నారు.

0 comments:
Post a Comment