ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు హెచ్చరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీయే రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్షం పాత్ర వహిస్తోందని తెలిపారు. వైఎస్ఆర్ హయాంలో ఏ రకమైన ఛార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. ఆయన పేదల పక్షాన, వారికి అండగా నిలిచారన్నారు. వైఎస్ఆర్ ప్రతిపేద గుండెలో ఉన్నారన్నారు. ఆయన రూపాన్ని పేదవాడి గుండెలో నుంచి తొలగించడం వీరి ఎవరివల్లా కాదన్నారు. ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే తమ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అబద్దాలతో రాజకీయం చేశారని విమర్శించారు. చంద్రబాబుని విమర్శిస్తే పరువు నష్టం దావా వేస్తామని ఆ పార్టీ నేత ఎర్రన్నాయుడు అంటున్నారని, అసలు చంద్రబాబుకి పరువు ఉంటే గదా పరువు నష్టం దావా వేసేది అని ఎద్దేవా చేశారు. టిడిపి కార్యాలయం కాంగ్రెస్ బ్రాంచ్ కార్యాలయంగా మారిందన్నారు. జగన్ ని ఎదుర్కొనే సత్తాలేక టిడిపి గోబెల్ ప్రచారం చేస్తోందన్నారు. టిడిపికి, కాంగ్రెస్ కు ఉప ఎన్నికలలో డిపాజిట్లు కూడా దక్కవన్నారు.
కోవూరుకు అభ్యర్థిని ప్రకటించి సిపిఎం ఇచ్చిన షాక్ తో చంద్రబాబుకు

0 comments:
Post a Comment