వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ మార్చి 2 నుంచి శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మార్చి 2న విడవలూరు, 3న కొడవలూరు, 4న ఇందుకూరుపేట మండలాల్లో ఆయన తొలి విడత ప్రచారం నిర్వహించనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తరపున ఆయన ప్రచారం చేస్తారు. కాగా ఈనెల 25న ప్రసన్నకుమార్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
0 comments:
Post a Comment