కొవ్వూరులో వైఎస్సార్ కాంగ్రెస్ తరపున బరిలోకి దిగుతున్న నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తప్పకుండా విజయం సాధిస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ పి.శంకర్రావు పేర్కొన్నారు. వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నికల్లో కష్టపడితే టీడీపీ విజయం సాధిస్తుందని చెప్పారు. మిగిలిన చోట్ల టీఆర్‌ఎస్ గెలుస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని పదవి నుంచి తొలగించేందుకు ఆగస్టు 15వతేదీ చివరి గడువ ని, ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే వాటి ఫలితాల అనంతరం తొలగిస్తారని వ్యాఖ్యానించారు. త్వరలో మరో నలుగురు చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లకు వెళతారన్నారు. మంత్రులు మోపిదేవి వెంకటరమణ, సబితా ఇంద్రారెడ్డిల గురించి తాను చెప్పింది ఇపుడు నిజమవుతోందన్నారు.





0 comments:
Post a Comment