రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత కమతం రాజేందర్‌రెడ్డి మంగళవారం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పరిగి నియోజకవర్గంలో కీలక పట్టున్న ఆయన కాంగ్రెస్‌లో గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అయితే వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు రాజేందర్‌రెడ్డి ప్రకటించారు. ఆయనతో పాటు మరో ఇరవై మంది స్థానిక నేతలు కూడా జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.





0 comments:
Post a Comment