తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి సొంత నియోజకవర్గంలో
విజిటింగ్ ప్రొఫెసర్ లావ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక
మండలి సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. తిరుపతి వాసుల సమస్యలను
గాలికొదిలేసిన చిరంజీవి హైదరాబాద్, ఢిల్లీల మధ్య చక్కర్లు కొడుతున్నారని
విమర్శించారు. నెల రోజులుగా తిరుపతిలో ప్రజా సమస్యలపై భూమన వార్డు బాట చేపట్టారు.
మండుటెండను సైతం లెక్కచేయకుండా వార్డు బాట నిర్వహిస్తూ ప్రజల సమస్యలను అడిగి
తెలుసుకుంటున్నారు.
0 comments:
Post a Comment