సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మౌత్ పీస్‌లా మారారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు విమర్శించారు. ప్రజా సమస్యలపై నారాయణ పోరాటం చేస్తే ఆఖరి పేజీలో వార్తలు రాసే రెండు పత్రికలు ఈ రోజు మొదటి పేజీలో ఎందుకు రాశారని గట్టు ప్రశ్నించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో రాసిన స్క్రిప్ట్‌ని ఈనాడు, దాని తోకపత్రికలు రాశాయని ఆరోపించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడిన మాటలను నారాయణ ఉపసంహరించుకోవాలని గట్టు డిమాండ్ చేశారు.





0 comments:
Post a Comment