వైఎస్ఆర్ లాంటి సీఎం తన చిన్నతనంలో ఉండివుంటే తాను మంచి ఉన్నత చదువులు చదివేవాడినని మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆకాంక్షించారు. మహా శివరాత్రి సందర్భంగా ఆయన సోమవారం తూర్పుగోదావరి జిల్లాలోని పలు శివాలయాలను సందర్శించారు. అనపర్తి నియోజకవర్గ పరిధిలోని గొల్లల మామిడాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు బోస్ ను బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. స్థానిక శివాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ ధ్యాన మందిరాన్ని సందర్శించారు.





0 comments:
Post a Comment