రానున్న మునిసిపల్ ఎన్నికలను దృష్టిలో వుంచుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. లోటస్‌పాండ్‌లోని క్యాంప్ కార్యాలయంలో అన్ని జిల్లాల మునిసిపల్ పరిశీలకులతో పార్టీ అధ్యక్షడు, ఎంపి జగన్మోహన రెడ్డి సమావేశమయ్యారు. ప్రధానంగా మున్సిపాలిటీల్లో పార్టీ ప్రస్తుత పరిస్థితి, వార్డుల వారీగా ప్రజాసమస్యలపై ఆందోళన, గడపగడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లటం తదితర అంశాలపై చర్చించారు. పార్టీని మరింత బలోపేతం చేసి మున్సిపాలిటీలను కైవసం చేసుకునే ప్రణాళికపై సమగ్ర చర్చ జరిగింది. పురపాలక సంఘాల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేశారు.





0 comments:
Post a Comment