పేద
విద్యార్థుల ఉన్నత చదువుల కోసం దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి
ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తేసేందుకు కిరణ్
ప్రభుత్వం కుట్రచేస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగ అధ్యక్షుడు
పుత్తాప్రతాప్‌రెడ్డి దుయ్యబట్టారు. రీయింబర్స్‌మెంట్ పథకానికి ’8వేల
కోట్లు అవసరమవగా కేవలం ’3,600 కోట్లు మాత్రమే కేటాయించి పథకానికి తూట్లు
పొడుస్తున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేద విద్యార్థులను
ఉన్నత చదువులకు దూరం చేసేందుకు సీఎం కిరణ్ కుట్ర చేస్తున్నారని
విమర్శించారు. అదే విధంగా ‘యువకిరణాలు’ పేరుతో రాష్ట్ర యువతను మోసం
చేస్తున్నారన్నారు. డిసెంబర్ నెలలోనే లక్ష ఉద్యోగాలని చెప్పిన సీఎం
ఇప్పటిదాకా ఒక్కటీ ఇవ్వలేకపోయారన్నారు. యువకిరణాలపై నమ్మకం లేకనే ప్రధాని
మన్మోహన్‌సింగ్ కూడా రాష్ట్ర పర్యటనను రద్దు చేసుకున్నారని, రాష్ట్రానికి
ఇంతకన్న అవమానం మరోకటి ఉండదన్నారు. మళ్లీ అదే మాదిరిగా మూడేళ్లలో 15 లక్షల
ఉద్యోగాలంటూ ఎవర్ని మోసం చేయాలనుకుంటున్నారని పుత్తా నిలదీశారు.
0 comments:
Post a Comment