నెల్లూరు
జిల్లా కోవూరు ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరూ
అడ్డుకోలేరని, అక్కడ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విజయం నల్లేరు మీద
నడకలాంటిదని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. కోవూరు ఉప ఎన్నిక
రాష్ట్ర ప్రజానాడికి దర్పణం పట్టనుందని తెలిపారు. పార్టీ నేతలు కాకాని
గోవర్ధన్‌రెడ్డి, యల్లసిరి గోపాల్‌రెడ్డిలతో
కలిసి పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు కలిసి ఎన్ని కుయుక్తులు పన్నినా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. కడప,
పులివెందుల ఉప ఎన్నికల ఫలితాలే కోవూరులో కూడా పునరావృతమవుతాయని చెప్పారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో ఉన్న
విపరీతమైన అభిమానం ధాటికి కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు కూడా
దక్కవన్నారు. గ్రామానికొక ఎమ్మెల్యే, మండలానికొక మంత్రిని ఇన్‌చార్జిగా
నియమించినప్పటికీ కాంగ్రెస్‌కు పరాభవం తప్పదని చెప్పారు. ప్రసన్న గతంలోకంటే
భారీ మెజార్టీతో గెలవనున్నారని తెలిపారు.
పార్టీ రెండో ఎమ్మెల్యే మా జిల్లా నుంచే
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రసన్నకుమార్‌రెడ్డిని రెండో ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపడం తమ జిల్లాకు దక్కిన వరంలా భావిస్తామని పార్టీ నేతలు కాకాని గోవర్ధన్‌రెడ్డి, యల్లసిరి గోపాల్‌రెడ్డి చెప్పారు. ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని కోవూరు ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. కుమ్మక్కు రాజకీయాలను కడిగేయడానికి పార్టీ తరపున నల్లపురెడ్డి అసెంబ్లీలో అడుగు పెడతారన్నారు. కేబినట్‌లో శక్తివంతమైన ఆర్థిక మంత్రి జిల్లా వాడే అయినప్పటికీ, వైఎస్సార్ కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు.

0 comments:
Post a Comment