ప్రజల
పక్షాన చిత్తశుద్ధితో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి
ఒక్కరే పోరాడుతున్నారని రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, బీసీ ఐక్య
సంఘటన సమితి అధ్యక్షుడు వీజీఆర్ నారగోని అన్నారు. భవిష్యత్తులో జగన్ బడుగు,
బలహీన వర్గాలకిచ్చే ప్రాధాన్యాన్ని బట్టి, ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను
చూసి పొత్తు పెట్టుకుంటామన్నారు. ‘ఓటు అమ్ముకునే సరుకు కాదు, ఓటర్లను
మభ్యపెట్టే చెంచాల- దళారీల వ్యవస్థను నిర్మూలిద్దాం’ అనే నినాదంతో
రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నట్టు నారగోని
తెలిపారు. దీనిలో భాగంగా కొత్తపేట వచ్చిన ఆయన శనివారం విలేకరులతో
మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలకు నూకలు చెల్లాయన్నారు. జగన్
కాంగ్రెస్‌ను వీడడంతో ఆ పార్టీకి పెద్ద గండి పడిందని, కాంగ్రెస్‌కు ఇదే
చివరి ప్రభుత్వమని అన్నారు. టీడీపీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని,
చంద్రబాబు తనపై తానే పోరాటం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మద్యపాన
నిషేధాన్ని ఎత్తివేసి, విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టించి, నేడు మద్యం
సిండికేట్లపై అవినీతి అంటూ రోడ్డెక్కారన్నారు. చిరంజీవి టికెట్లిచ్చే
స్థాయి నుంచి సీట్లు, పదవులు అడుక్కునే స్థితికి దిగజారిపోయారన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్‌తో అంతర్గతంగా చేతులు కలిపి బొత్సకు ఎసరు పెడుతున్నారని
నారగోని విమర్శించారు.
0 comments:
Post a Comment